- అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు
- మండెపల్లి గ్రామంలో తీవ్ర విషాదం

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన సురకాని మనితేజ అనే యువకుడు మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెలుతున్న సమయంలో ప్రభుల్లా రెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో మణితేజ అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే బుధవారం ఉదయం వాకింగ్ కు వెళ్లిన కొంతమంది వ్యక్తులు బైకు ప్రమాదాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించడంతో ఘటన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.