- ఆచార్య రామరాజు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :
బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ నిట్ వరంగల్, రాష్ట్రీయ ఆవిష్కార్ అభయాన్, స్కోప్ ప్రాజెక్టు నిట్ వరంగల్, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్, జన విజ్ఞాన వేదిక హనుమకొండ జిల్లా కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో “సైన్స్ కమ్యూనికేషన్ ఒక రోజు వర్క్ షాప్” నిట్ వరంగల్ విశ్వేశ్వరయ్య స్కిల్ డెవలప్మెంట్ భవనంలో ఆదివారం నిర్వహించబడినది. ఆచార్య ఆంజనేయులు సంధాన కర్తగా వ్యవహరించిన కార్యాశాలలో ప్రధాన వక్తగా హాజరైన ఆచార్య రామరాజు జీవ పరిణామ సిద్ధాంతం, సెన్స్ బయో మెటీరియల్స్ జనరేషన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు. డాక్టర్ రాములు జీవ పరిణామ సిద్ధాంతాన్ని రుజువులతో తెలియజేశారు. ఎన్విరాన్మెంటల్ సబ్ కమిటీ కన్వీనర్, కె బి ధర్మ ప్రకాష్ గో గ్రీన్ బ్రీతింగ్ టుమారో అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. మీట్ ద సైంటిస్ట్ కార్యక్రమంలో భాగంగా ఆచార్య రామరాజు, రిటైర్డ్ అటవీ అధికారి, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కాజీపేట పురుషోత్తం లు వర్క్ షాప్ కు హాజరైన వారి సందేహాలను నివృత్తి చేశారు. ప్రధాన కార్యదర్శి రామంచ బిక్షపతి, జిల్లా నాయకులు పరికిపండ్ల వేణు, సుమలత, వకుళాభరణం శ్రీనివాస్, వందన, సుమతి, డాక్టర్ ప్రభాకర్ చారి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




