- పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హనుమకొండ జిల్లా కేంద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మానసిక వికలాంగుల తో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న వర్ధన్నపేట శాసన సభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. తొలుత మానసిక వికలాంగుల పిల్లలు డాన్స్ ప్రోగ్రాం తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. మానసిక వికలాంగుల మధ్యలో పుట్టిన రోజు వేడుకలు జరుపు కోవడం ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. అన్ని ఉండి అందరితో హుందాతనంగా జన్మదిన వేడుకలను అంగు ఆర్భాటాలతో చేసుకుంటున్న తరుణంలో ఒక సామాన్య వ్యక్తిగా సాదా సీదాగా మానసికంగా ఇబ్బంది పడుతున్న చిన్నారుల మధ్య వేడుకలను చేసుకోవడం తన యొక్క పూర్వజన్మ సుకృతంగా, నా తల్లి దండ్రుల అదృష్టంగా భావిస్తున్నట్లు భావోద్వేగంతో తెలియజేశారు. తన జన్మదినం సందర్భంగా మనోవికాస కేంద్రంలో మానసికంగా ఇబ్బంది పడుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు చేసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. తన పుట్టినరోజు కానుకగా చిన్నారులకు బహుమతులను పంచిపెట్టి వారితో కలిసి భోజనం వడ్డించి వారి ఆలనా పాలన చూచుకొనుటకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని నిర్వాహకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మానసిక పిల్లలు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.




