- ప్రముఖ చిత్రకారుడు ప్రభు

నేటి సాక్షి, జమ్మికుంట : 14 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల ప్రజలను ఏకం చేసి ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా జమ్మికుంట జమ్మికుంట పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు) తన జన్మదిన సందర్భంగా కెసిఆర్ పదేళ్ల పాలనలో వృద్ధులకు వితంతులకు రైతులకు వికలాంగులకు అనేక సంక్షేమ పథకాల ద్వారా సకల జనుల గుండెల్లో నిలిచిన మహానేత పేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు ప్రభు మాట్లాడుతూ కెసిఆర్ స్వరాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడి సకల జనుల ఏకం చేసిన మహానేతగా అభివర్ణిస్తూ దేశంలోనే గొప్ప నాయకుడిని ఆయనపై ఇష్టంతో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకు కేసీఆర్ అని టైటిల్ కనుగుణంగా తన చిత్రపటాన్ని వృద్ధ మహిళ తన ఫోటోను ముద్దాడుతున్న సందర్భాన్ని కల్లకు కట్టినట్టుగా తన గీసిన చిత్రం ద్వారా చూపించడం తనకు ఆనందంగా ఉందన్నారు. కెసిఆర్ జన్మదిన సంధర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ తన సేవలు అందించాలని అభివర్ణించారు.





