Thursday, March 26, 2026

రాయికల్ లో బిజెపి శ్రేణుల సంబరాలు

నేటిసాక్షి, రాయికల్ : ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్య అఖండ విజయం సాధించిన సందర్భంగా రాయికల్ పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద రాయికల్ బిజెపి పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో టపాసులు కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ ఆకుల మహేశ్, మాట్లాడుతూ మేధావి వర్గం టీచర్లు అందరూ బిజెపి వైపే ఉన్నారని ఈ విజయంతో అవగతమౌతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోబిజెపి విజయం సాధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్ ,ఎంఎల్సి కన్వీనర్ లు సాయిరాజ్, సామల్ల సతీష్, కడార్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కునారపు భూమేష్ , ఓబీసీ మోర్చ అధ్యక్షులు తోపారపు ఆశన్న, సింగని సతీష్ , తుడుం దెబ్బ రాష్ర్ట నాయకులు ఆత్రం రవి, పట్టణ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News