నేటి సాక్షి, మందమర్రి:– భారతీయ జనతా పార్టీ నూతన జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ను బిజెపి మండల, పట్టణ నాయకులు మంగళవారం జిల్లాలోని చెన్నూరు పట్టణంలో గల ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు గిర్నేని జనార్ధన్ మాట్లాడుతూ, వెంకటేశ్వర గౌడ్ నాయకత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దేవరనేని సంజీవరావు, డివి దీక్షితులు లు పాల్గొన్నారు.





