Sunday, March 22, 2026

స్వయం ఉపాధికి బీజేపీ ప్రభుత్వం ప్రోత్సాహకం

  • బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ.

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన గొంటి లక్ష్మణ్ వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ లెమన్ సప్లయర్స్ వ్యాపార సముదాయాన్ని బిజెపి నాయకులు ప్రతాప రామకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి ప్రోత్సాహకాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధిని కల్పించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. విశ్వకర్మ యువజన ద్వారా లబ్ధి పొంది, లెమన్ సప్లయర్స్ వ్యాపార సముదాయాన్ని నెలకొల్పడం శుభసూచికమన్నారు. ఈ సందర్భంగా నిర్వాకుడు గొంటి లక్ష్మణ్ ను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారుడు గొంటి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి, కేంద్రమంత్రి బండి సంజయ్, బిజెపి నాయకులు ప్రతాప రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్, కోల కృష్ణ స్వామి నాయకులు రేగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News