- గద్వాల జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నిరసన వ్యక్తం చేసిన
- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారని జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ అన్నారు..టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బడ్జెట్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైకరికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సరితమ్మ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదని,తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు. బీహార్, ఆంధ్రకి తప్ప ఎవరిని పట్టించుకోలేదన్నారు. ఇది కుర్చీ కాపాడుకోవడం కోసం పెట్టిన బడ్జెట్ లాగా ఉందన్నారు. ఏపీలో పోలవరం నిర్మాణనికి వేల కోట్లు ఇస్తామంటున్న కేంద్రప్రభుత్వం. తమ ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వరని ప్రశ్నించారు. కేంద్రంతో ఫ్రెండ్లిగా ఉండటం తమ చేతగాని తనం కాదన్నారు. వివక్ష లేకుండా తమ రాష్ట్రానికి రావల్సిన నిధులు కేటాయించాలన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించినట్టు కనిపిస్తోందన్నారు. మొదటి నుండే ప్రధాని తెలంగాణ పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రాకు మాత్రం అన్ని విధాలుగా నిధులు ఇచ్చారని తెలిపారు. అయితే దానికి తాము ఎలాంటి విమర్శలు చేయడంలేదన్నారు. అదే సందర్భంగా పునర్విభజన చట్టంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మద్దతు ఇచ్చే పార్టీలతో లాలూచీ పడిన బడ్జెట్ ఇది అని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బిజెపికి చెందిన 8మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీ లను గెలిపిస్తే. రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు తెలంగాణ అభివృద్ధి పట్టదా సరితమ్మ నిలదీశారు. రాష్ట్రంపై ప్రేమ ఉంటే వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని సరితమ్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ఆయా స్థాయిల కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల మహిళా, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





