నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి);
భారతీయులకు పవిత్రమైన పార్లమెంట్ లో రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ సీనియర్ ఎంపీ ప్రతాప్ సారంగి పై ప్రత్యక్ష దాడి, మహిళా ఎంపీ ల పట్ల దురుసుగా ప్రవర్తించడం పట్ల బారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కొప్పుల మహేష్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నే ఎన్నికల్లో అంబేద్కర్ ను ఓడించి అవమాన పరచిందన్నారు. ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కి కనీస గుర్తింపు ఇవ్వలేదన్నారు. అంబేద్కర్ పేరును పలికే అర్హత కూడ కాంగ్రెస్ కు లేదన్నారు.బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ కి భారతరత్న ఇచ్చి గౌరవించిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు సంకెండ్ల నర్సయ్య, బొజ్జ సంపత్, సంగెo వేణు, కొమ్మ ఐలయ్య, నాడెం రాజన్న, నల్ల గంగారెడ్డి, గుమ్మడి శంకరయ్య, బుసారపు రవీందర్, లక్కకుల సంజయ్, మాధసు హర్ష వర్ధన్, గుంటి అశోక్, మోహన్ రెడ్డి బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.