
నేటి సాక్షి ,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి): బిజెపి రాష్ట్ర కార్యాలయం పై దాడికి నిరసనగా పెద్దపల్లి లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ సూచన మేరకు పెద్దపల్లి బస్టాండ్ చౌరస్తాలో రాస్తారోకో చేయడం జరిగినది. బిజెపి నాయకులు మాట్లాడుతూ…అధికార మదంతో వీధి రౌడీల్లా రెచ్చిపోతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు… నిరసన పేరుతో భారతీయ జనతా పార్టీ కార్యాలయం పై రాళ్లతో దాడి చేసి కార్యకర్తలను గాయ పరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.రాష్ట్రంలో అధికారంలో ఉన్నామనే తల బిరుసుతో ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే చేతకాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థలను అడ్డుపెట్టుకొని గుండాల మాదిరిగా వ్యవహరిస్తే తరిమి తరిమి కొడతాం. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాయకుండా బిజెపి కార్యాలయం పై దాడి చేసిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించకుంటే జరిగే పరిణామాలకు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు తంగెడ రాజేశ్వర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు కావేటి రాజగోపాల్, ఒల్లె తిరుపతి,వేల్పుల రమేష్, పెంజర్ల రాకేష్, ఉప్పు కిరణ్.ముంజ రాజేంద్రప్రసాద్, పడాల శ్రీధర్, గుడ్ల సతీష్, కుమార్, మామిడి ఉమేష్, ఆడేపు రమేష్, రాజ్ కుమార్. శ్రీధర్.గాదాసి సతీష్, బొడ్డుపల్లి సంపత్, అంజి, సాయి, బాలసాని శ్రీను, వినయ్,రేవంత్,బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





