Sunday, March 15, 2026

బూత్ నంబర్ 264 , 265 , 322 లో అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన బిజెపి నాయకులు

నేటి సాక్షి, ఖమ్మం :
ఖమ్మం పట్టణం లోని 22వ డివిజన్లో బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ బండ్ల మాధురి రీగన్ ప్రతాప్ ఆధ్వర్యంలో ఒకటో పట్టణ అధ్యక్షుడు గడిల నరేష్ అధ్యక్షతన స్థానిక 1 టౌన్ స్తంభాన్ని నగర్ ఏరియా నందుగల బూత్ నంబర్ 264 , 265 , 322 లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీ మూర్తులకు , బాలింతలకు పౌష్టిక ఆహారం అందించాలని లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన అంగన్వాడి కేంద్రాలను సందర్శించడం జరిగింది . పిల్లలకి అందిస్తున్న పౌష్టికాహారం , మౌలిక వసతుల గురించి అక్కడ ఉన్న టీచర్స్ ను , ఆయా లను అడిగి తెలుసుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వీరవల్లి రాజేష్ గుప్తా , మంద సరస్వతి , బోయినపల్లి చంద్రశేఖర్ , మారుతి వీరభద్ర ప్రసాద్ , పిల్లలమర్రి వెంకట్ , 1 టౌన్ నాయకులు పాలెపు రాము , దీకొండ శ్యామ్ , ఉరకొండ ఖాదర్ , గోలీ ఫణి కుమారి , గోలీ వెంకటేశ్వర్లు , కందిమల్ల రామారావు పాల్గొనడం జరిగింది .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News