- భారతీయ జనతా పార్టీ నూతన జెండా దిమ్మె పూజ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరియు శ్రీరాములు అందెల
- చేవెళ్ల పార్లమెంట్ వ్యాప్తంగా 100 అధునాతన భారతీయ జనతా పార్టీ జెండాలను ఏర్పాటు చేస్తాం – కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి మరియు వీరకర్ణ రెడ్డి ఆధ్వర్యంలో నూతన బిజెపి జెండా కొరకు నిర్వహించినటువంటి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తో కలిసి పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల శ్రమతో చేవెళ్ల పార్లమెంటు వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధునాతన జెండాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల వాతావరణం నెలకొందని, రానున్న రోజుల్లో తెలంగాణలో మరింత బలంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందని మరియు సంస్థాగతంగా పార్టీని పటిష్టంగా చేసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే దిశగా ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. అనంతరం బడంగ్ పేట్ లోని శివ సాయి నగర్ కాలనీలో పర్యటించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను పరిశీలించి స్థానిక కార్పొరేషన్ కమిషనర్ కి ఫోన్ కాల్ చేసి వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఓబిసి మూర్చ రాష్ట్ర నాయకులు నడికుడ యాదగిరి, బిజెపి సీనియర్ నాయకులు సామ సంజీవరెడ్డి, మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు రమాదేవి శ్రీనివాస్, గడ్డం లక్ష్మారెడ్డి, దడిగ శంకర్, బిజెపి సీనియర్ నాయకులు ఏనుగు ప్రభాకర్ రెడ్డి, తర్రే మల్లేష్ యాదవ్, శ్రీశైలం చారి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వేణు గౌడ్, జక్కడి మధుసూదన్ రెడ్డి, చిత్రం శ్రీనివాస్, రాష్ట్ర ఓబిసి మోర్చా నాయకులు లాల సందీప్, పాలుబాయ్ లక్ష్మణ్, రేసు నరసింహ రెడ్డి, రావుల మల్లేష్, శివరాం రెడ్డి, కుంటి భాస్కర్, నిమ్మల రవికాంత్ గౌడ్, రాంబాబు, దేశపాక జగన్, ఏ శ్రీనివాస్ గౌడ్, మంగాపతి నాయక్, మోతిలాల్ నాయక్, జక్కడి సురేందర్ రెడ్డి, రామిడి మహేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జిల్లా దిశా కమిటీ సభ్యులు అంబోజి శ్రీనివాస్, సామ సుధాకర్ రెడ్డి మహిళా మోర్చా నాయకురాళ్లు నివేదిత, అర్చన, పద్మ, మీనాక్షి, బాలమని, బీజేవైఎం నాయకులు ప్రవీణ్ గౌడ్, క్యారగారి.అరవింద్, భరత్ ముదిరాజ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.



