Wednesday, March 18, 2026

ఢిల్లీ విజయంతో బీజేపీ శ్రేణుల సంబురాలు

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడగా డిల్లీ ప్రజలు అవినీతి ఆప్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి, బీజేపీ పార్టీకి ఘన విజయం అందించడంతో జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి, సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ, దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారథ్యంలో ఢిల్లీలో బీజేపీ పార్టీ 27 ఏండ్ల తరువాత అధికారంలోకి రావడం సంతోషకరమన్నారు. గత 10 సంవత్సరాలుగా ఢిల్లీలో కొనసాగుతున్న అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. గతంలో జరిగిన మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పిన, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదని, ఢిల్లీ ఎన్నికల్లో మరొకసారి ఖాతా తెరవకుండా కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న దేశ అభివృద్ధిని చూసి ఢిల్లీ ప్రజలు బీజేపీ పార్టీకి అధికారం కట్టబెట్టారని తెలిపారు. మోడీ నేతృత్వంలో త్వరలో తెలంగాణలో సైతం బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దుర్గం అశోక్, పట్టి వెంకటకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, తుల ఆంజనేయులు, బియ్యాల సతీష్ రావు, జోగుల శ్రీదేవి, ముదాం మల్లేష్, బోయిని హరికృష్ణ, పల్లి రాకేష్, బింగి సత్యనారాయణ, ఆవిడపు రాజబాబు, నాగుల రాజన్న, పచ్చ వెంకటేశ్వర్లు, చిరంజీవి, తరుణ్, కెమెర అర్జున్, రాజమౌళి, అనిల్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News