నేటి సాక్షి, బెజ్జంకి: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు నిన్న ప్రకటించగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు చిన్న మైల్ అంజి రెడ్డి మరియు మల్కా కొమురయ్య విజయం సాధించారు. ఈ సందర్భంగా గురువారం బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడంతో పాటు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేస్తూ ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి,కొలిపాక రాజు మాట్లాడుతూ, ఈ విజయానికి కృషి చేసిన పట్టభద్రులు, ఉపాధ్యాయులకు బీజేపీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమై, కమీషన్లకే ప్రాధాన్యం ఇచ్చిందని,అందుకే ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు.అనంతరం ముత్తన్నపేట గ్రామానికి చెందిన బూత్ అధ్యక్షుడు గాజ రవి అకాల మృతి చెందగ వారి కుటుంబానికి బీజేపీ మండల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి పార్థివ దేహంపై బీజేపీ జెండా కప్పి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బుర్ర మల్లేశం గౌడ్, మండల సీనియర్ నాయకులు దొమ్మాట రాములు, మండల ఉపాధ్యక్షులు కొత్తపేట రామచంద్రం, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి గంప రవికుమార్, సోషల్ మీడియా కన్వీనర్ దొడ్ల ప్రశాంత్, సాన వేణు,సుధీర్ రావు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



