Friday, March 20, 2026

BKR ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7వ ఉచిత వైద్య శిబిరం………… కుత్బుల్లాపూర్ నవంబర్ 27 :

(నేటి సాక్షి )కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలోదుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని చర్చి గాగిలాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది కిషోర్ రెడ్డి మాట్లాడుతూ …….పేద మద్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి పేర్కొన్నారు.BKR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికవర్ వైద్య బృందం చే గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ చర్చ్ గాగిలాపూర్లో ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ శిబిరంలో అనేకమంది పేద మధ్యతరగతి ప్రజలు వైద్య పరీక్షలు నిర్వహించి …ఉచిత మందులను పంపిణీ చేశారు.పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్య సేవలందించే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నట్లు తెలిపారు.నేటి సమాజాని మెడికవర్ హాస్పిటల్ లాంటి సంస్థలు ఎంతో ఉపయోగకరమని సూచించారు.వైద్య శిబిరాల్లో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరుగుతుందని,తద్వారా సకాలంలో చికిత్స పొందవచ్చని గుర్తు చేశారు.గ్రామీణ ప్రాంత ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యక్తం చేశారు.అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేటట్లు తన వంతు కృషి చేస్తున్నానని తెలియజేశారు.అనంతరం ఉచిత వైద్య సేవలు అందించిన మెడికవర్ హాస్పిటల్ వైద్యులకు బొంగునూరి కిషోర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీకర్ రెడ్డీ , కావాలి గణేష్ , ప్రేమ్ కుమార్ , షఫీ , రాము యాదవ్ , గజా , లింగం గౌడ్ , ఎరువా ప్రదీప్ రెడ్డీ, సతీష్ రెడ్డీ, వినోద్ రెడ్డీ, సుధీర్ రెడ్డీ, నవీన్ రెడ్డీ, ప్రదీప్ రెడ్డీ, పులి రాజా కోటి, జోసెఫ్ రెడ్డీ, బాలరాజ్ రెడ్డి, అశోక్ రెడ్డీ, జైపాల్ రెడ్డి,కాలనీ వాసులు గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News