Sunday, March 22, 2026

ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బిఆర్ఎస్ నాయకులకు లేదు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఐ ఎన్ టి యు సి హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు కస్తూరి రవి ఒక ప్రకటన లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ఎమ్మెల్యే లను మంత్రుల ను కలుపుకొని ప్రజా పరిపాలన సజావుగా కొనసాగిస్తున్నారని కొనియాడారు. రైతుల సంక్షేమం కొరకు నిరుద్యోగుల భవిష్యత్తు మరియు కార్మికుల పక్షాన మంచి చేయాలని ఉద్దేశంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓర్వలేకే బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పగటి కలలుకంటూ మళ్లీ వచ్చే ప్రభుత్వం మాదే అధికారం మాదే అంటున్నారు కానీ తెలంగాణ ఉద్యమం లో ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఒక్కసారి మీరు ఆత్మ విమర్శన చేసుకోవాలని అన్నారు. ఉద్యమ సమయంలో మీరు ఇచ్చిన మాటకు ఎందరు కట్టుబడి ఉన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని తెలంగాణ వస్తే నీళ్ళు నిధులు నియామకాలు అన్నారు కానీ ప్రవేట్ సెక్టార్లో వివిధ కంపెనీలో చేసేవారికి ప్రభుత్వం ఏర్పడ్డాక 75% స్థానిక కార్మికుల కే రిజర్వేషన్ ఇస్తానన్నారు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కాదని భారత రాష్ట్ర సమితి గా ఎప్పుడైతే మీరు పేరు మార్చినారో అప్పటి నుండి మీ పతనం ప్రారంభమైంది ఇది ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలన్నారు. భారత రాష్ట్ర సమితి గా పేరు మార్చి నప్పుడు మీరు చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు తెలంగాణ కోసం సావు నోట్లో తలకాయ పెట్టిన తెలంగాణ తెచ్చిన వీరుడ వని అనుకున్నారు. కానీ ఎంత మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు అయినారు..? ఎంతమంది ఉద్యమ కారుల పొట్టను కొట్టారు..? తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ కారుల ఊసే లేదు విద్యార్థి అమర వీరుల ఉసే లేదు ఇప్పుడు ప్రజల కోసం తెలంగాణ కోసం పోరాటం చేస్తాం అంటూ మాయ మాటలు చెప్పి ప్రజలలోకి రావడానికి మాత్రమే మీరు చేసే ఆరాటం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు పదేళ్ల పరిపాలనలో ప్రజలు నీకు గుర్తుకు రాలేదు ఫామ్ హౌస్ కే పరిమితమైనారు ప్రతిపక్ష నేతగా గత 14 నెలల నుంచి కూడా ఫామ్ హౌస్ పరిమితమైన మీరు, ఇప్పుడు మీరు హరీష్ రావు, కేటీఆర్, అధికారం పోగానే ఏదో జనాలని మభ్య పెడుతూ మళ్లీ వచ్చేది మేమే అని అంటున్నారు. అది సాధ్యం కాదు ప్రజా పాలనలో పరిపాలన దృష్టిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. పగటి కలలు కనకుండ ప్రజలకు ఏం చేస్తే సంతోషంగా ఉంటారో అని తెలుసుకొని ప్రభుత్వానికి సూచన ఇస్తూ ప్రజా స్వామ్యం లో కలవాలి తప్ప చేసేది ఏమీ లేదు ప్రజల చేత ఎన్నుకోబడ్డ మీరు ప్రజా స్వామ్యం లో ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారు గనుక ప్రజలలో మమేకమై ప్రజల మంచి కోరే విధంగా నిలవాలి అని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News