
నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరియు సిద్దిపేట శాసనసభ్యుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ను హైదరాబాద్లోని వారి నివాసాల్లో వేర్వేరుగా కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులను కలిసిన వారిలో బెజ్జంకి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లింగాల లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దీటి రాజు, నాయకులు బొమ్మకంటి రామలింగారెడ్డి, తాళ్లపల్లి నరేష్ గౌడ్, కత్తి రాములు గౌడ్, ఎలుకంటి తిరుపతిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

