బ్రిడ్జి జేఏసీ చెర్మన్ సంపతి ఉదయ్ కుమార్ డిమాండ్
నేటిసాక్షి, గన్నేరువరం ( బుర్ర అంజయ్య గౌడ్):
కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతున్న సమయంలో బిఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని మానకొండూర్ నియోజవర్గ కాంగ్రెస్ నాయకులు, గన్నేరువరం మండల బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే బర్త్ రఫ్ చేయాలని అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. ఎమ్మెల్యే హోదా లో ఉండి గొడవ చేసుకోవడం సరైనది కాదని ఎమ్మెల్యే ఎలక్షన్స్ సమయంలో నీ స్థాయి ఏంటో గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. ఇలాంటివి మళ్లీ పునర్వతం అయితే నిన్ను ఎక్కడికి తిరగనివ్వమని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ముందు దౌర్జన్యం చేస్తుంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.





