నేటి సాక్షి కోదాడ ప్రతినిధి : సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో కోదాడ మాజీ శాసన సభ్యులు, బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం అనంతగిరి మండల ఎన్టీఆర్ చౌరస్తాలో చేపట్టారు. ఈ సందర్భంగా అనంతగిరి మండల పార్టీ అధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ…. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యకలాపాలు అవలంభిస్తు రైతులకు రైతు భరోసా 15,000/-లు ఎన్నికల సమయంలో ఇస్తానని చెప్పి ఒక సంవత్సరం గడిచాక ఇప్పుడు 12,000/-లు ఇస్తామని చెప్పడం ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచింది.ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సరిగా నెరవేర్చకుండా కాలయాపన చేస్తు డైవర్శన్ రాజకీయాలు చేస్తుంది.ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతుభరోసా 15,000/-లు ఇవ్వాలి లేదంటే బి ఆర్ ఎస్ పార్టీ రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుంది అని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుగులోతు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు యండి అఫ్జల్, సీనియర్ పార్టీ నాయకులు పి. వీరయ్య, ఐతన బోయిన వెంకటేశ్వర్లు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు భుక్యా బోస్, పోర్ల సత్యనారాయణ ప్రచార కార్యదర్శి ఎస్ డి సైదా, బెల్లంకొండ ఏడుకొండలు మన్నెం హరీష్ సొసైటీ చైర్మన్ హనుమంతరావు నెలకుర్తి ఉపేందర్ గంగూరి నందు, షేక్ హసన్, గుగులోతు సైదా, శివ, గోపి తదితరులు పాల్గొన్నారు.

