- 2 లక్షల పార్టీ ప్రమాద బీమా చెక్కు అందజేత
నేటి సాక్షి, వేమనపల్లి:
సభ్యత్వం కలిగిన కార్యకర్తలు ప్రమాదవశత్తు మరణిస్తే బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళల అండగా ఉంటుందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గొర్లపల్లి గ్రామపంచాయతీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ముల్కల్ల శంకర్ ఇటీవల ప్రమాదవశత్తు మరణించినందున అతనికి బిఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా నుంచి మంజూరైన రూ. 2లక్షల చెక్కును వారి యొక్క కుటుంబ సభ్యులకు తన నివాసంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్ రావుతో కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలవాలనే లక్ష్యంతో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంచలనం అని పార్టీ బలోపేతానికి కృషిచేస్తూ, నమ్ముకొని ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. వీరి వెంట మొర్ల మొండి, లక్ష్మణ్, అదే పున్నం, జెల్ల మొండి, పర్వతాలు, బూరం బాణయ్య ,శ్రీశైలం, బానేశ్ తదితరులు పాల్గొన్నారు.





