- తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చనోడు ఢిల్లీలో నెరవేరుస్తాడంట
- సబితా ఇంద్రారెడ్డి

నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : పరిపాలించడం చేతగాక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, తప్పుడు కేసులు పెట్టి ప్రజలను మభ్య పెట్టడమే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందని తిరిగి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఇది రేవంత్ సర్కారు పనితీరు అని సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ పై ఘాటుగా స్పందించిన కేటీఆర్
రైతులను రుణమాఫీ పేరిట మోసం చేసిండు. రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేసేందుకు డిసెంబర్ 9న సంతకం చేస్తాతానన్నాడు. కానీ పూర్తిగా రుణమాఫీ కాలేదు. నీకు నిజాయితీ ఉంటే నీ సొంతూరు కొండారెడ్డిపల్లెకు పోదాం.. కొడంగల్‌కు పోదాం.. రుణమాఫీ అయిందని చెప్తే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో చెప్పాను. ఉలుకు పలుకు లేదు రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే డేట్, ప్లేస్, టైమ్ నీ ఇష్టం.. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపించు. వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసి పోతాం. చారాణా రుణమాఫీ కాలేదు. కానీ ఇవాళ డిల్లీకి పోయి రుణమాఫీ చేసిన అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు రైతుబంధు కింద రూ. 10 వేలు ఇస్తుండు నన్ను గెలిపిస్తే రూ. 15 వేలు ఇస్తానని చెప్పి ఏడాది దాటిపోయింది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎన్నికల సమయములో రూ. 7600 కోట్లు రైతుబంధు వేసేందుకు మేం సిద్ధమైతే ఈసీకి ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి. ఈ టైమ్‌లో వేస్తే కేసీఆర్‌కు ఓట్లు వేస్తారని చెబితే మోదీ ప్రభుత్వం ఆపింది. ఎన్నికలు అయిపోయాక రైతులను ఇబ్బంది పెట్టిండు.
కేసీఆర్ హయాంలో నాట్లప్పుడు రైతుబంధు పడుతుండే, ఇప్పుడు ఓట్లప్పుడు పడుతున్నాయి. కేసీఆర్ జమ చేసిన రూ. 7600 కోట్లను పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు. వానాకాలం పంటకు రైతుబంధు ఇవ్వలేదు. అందుకే ఇవాళ ధర్నా పెట్టాం. ఎందుకంటే.. ఇది ప్రారంభం మాత్రమే. రాష్ట్రమంతా ధర్నాలు పెడుతాం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 15 వేలు ఇవ్వాలి రైతుభరోసా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వానాకాలం రైతుబందును ఎగ్గొట్టిండు దాన్ని కూడా విడిచి పెట్టొద్దు అని కేటీఆర్ చెప్పారు.





