- టీపీసీసీ, స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్):
టీపీసీసీ, స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం శాశ్వతంగా బహిష్కరించాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ… దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ నేత పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని కేఎల్ఆర్ విమర్శించారు.
రేపు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ / జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దాహనం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు కిచ్చెన్న పిలుపు నిచ్చారు.





