నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, అన్నారం గ్రామంలో జంపాల రవి అనే 48 సంవత్సరాల వ్యక్తి, హత్యకు గురయ్యాడని, రామారెడ్డి ఎస్ఐ నరేష్ తెలిపారు. ఎస్సై నరేష్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, పొక్కిలి జంపాల రవి అనే వ్యక్తి ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు. మృతుడి భార్య సంగీత తన ఇద్దరు కూతుర్లతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. ఒంటరిగా ఉన్న రవిని చంపడానికి గిట్టనివారు పన్నాగం పన్నారని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా రవి అన్నను చంపాలని రాత్రిళ్ళు అతని అన్నను వెంబడించేవాడని తెలిసింది. ఈ హత్యకు కారణం ఆస్తి పంపకాలని గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది. అన్నదమ్ములు ఆస్తి పంపకాలు జరుపుకున్నప్పటికీ వారి మధ్య విభేదాలు సద్దుమనగకుండా కొనసాగుతూనే ఉన్నాయని గ్రామస్తులు, పోలీసులు తెలిపారు. అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటన స్థలాన్ని సిఐ రామన్ పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.





