Friday, April 3, 2026

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్

  • హైదరాబాద్ గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది..
  • వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది..
  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ( కోక్కల వంశీ ) :రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో వారు మాట్లాడుతూ.. అనవసర హంగామా లేకుండా వాస్తవికతకు అద్దం పట్టేలా బడ్జెట్ను రూపొందించాలని పేర్కొన్నారు.. పేదలు రైతులు మహిళలు దళిత బడుగు బలహీన మైనార్టీ వర్గాలను సంతృప్తి పరిచేల బడ్జెట్ ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దార్శనికతకు అర్థం పట్టేలా బడ్జెట్ ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3,04,965 కొట్లని, రెవెన్యూ వ్యయం 2,26,982 కొట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లుగా ఉందని తెలిపారు.. ఈ బడ్జెట్ తెలంగాణ భవిష్యత్తుకు మరింత గట్టి పునాదులు వేసేలా చర్యలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ధ్యేయంగా బడ్జెట్ ఉందన్నారు. వచ్చే పదేళ్ల కాలంలో తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని, తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక విజయవంతం అయ్యే దిశగా ఈ బడ్జెట్ అడుగులు వేసిందన్నారు. గత ఏడాదితో పోల్చితే తెలంగాణ వృద్ధి రేటు 10.01% శాతంగా నమోదు అయిందని ఇది దేశ అభివృద్ధి రేటు కంటే ఎక్కువని, తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 రూపాయలని దేశ తలసరి ఆదాయం కంటే 1.8 రేట్లు అధికంగా ఉందన్నారు. సేవారంగం 66.04 శాతం ఉండడం తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి నిదర్శనమని, వ్యవసాయ అనుబంధ రంగాలు 17.03 శాతం ఉంటూ దాదాపు 42.07 శాతం మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల ఆడబిడ్డలకు 5005 కోట్ల లబ్ధి జరిగిందని ఇప్పటివరకు 149.63 కోట్ల మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తద్వారా ఆర్టీసీ ఆక్యుపెన్సి రేషియో 94 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని ఇందుకోసం ఇప్పటివరకు 433 కోట్లు ఖర్చు చేశామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను 50 లక్షల కుటుంబాలకు అందజేస్తూ దానికోసం 1775.15 కోట్లు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించిందన్నారు.. 22,500 కోట్ల వేగంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇల్లు నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని తద్వారా 25.35 లక్షల మంది రైతులకు 20వేల 616 కోట్ల రుణమాఫీ జరిగిందని తెలిపారు. రైతు భరోసా సహాయాన్ని ఎకరానికి 12 వేల కోట్లు పెంచి ఇందుకోసం 18 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 చెల్లిస్తున్నాం అన్నారు. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లించి ఇప్పటివరకు 1206 కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లోకి మళ్లించడం జరిగిందని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News