నేటి సాక్షి, బెజ్జంకి: మండలంలో శుక్రవారం రాత్రి పిడుగు పడి పాడి గేదె మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మండలంలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన కల్లేపల్లి శ్రీనివాస్ అనే రైతుకు చెందిన పాడి గేదె పిడుగు పడి మృతి చెందింది. గేదె మృతి వలన తనకు 70,000 రూపాయలు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకొని నష్ట పరిహారం అందించాలని కోరారు.