
నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్ టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో, స్థానిక ఆర్డిఓ మన్నె ప్రభాకర్, డిఎస్పి శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులతో కలిసి, జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఎల్లారెడ్డి పట్టణంలోని పలు పాఠశాలలో జూనియర్, డిగ్రీ కళాశాల లో జీవధన్ హై స్కూల్ ల తోపాటు, మరికొన్ని విద్యాలయాలలోని, విద్యార్థిని, విద్యార్థులతో కలిసి, అధికారులు ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మన్నె ప్రభాకర్, డిఎస్పి శ్రీనివాసులు, ల తోపాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, స్థానికస్తా తాసిల్దార్, విద్యాశాఖ అధికారి, సీఐ, ఎస్ఐలు, విద్యార్థిని, విద్యార్థులతో కలిసి అంబేద్కర్ చౌరస్తా నుంచి, గాంధీ చౌక్ వరకు ఓటు హక్కు అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం అధికారులు విద్యార్థిని విద్యార్థులతో నేషనల్ ఓటర్స్ డే ప్రతిజ్ఞ చేయించారు. తాసిల్దార్ కార్యాలయంలో, ఐదుగురు సీనియర్ సిటిజనులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన యువతి యువకులు నూతన ఓటర్లుగా ఓటు హక్కును అందిపుచ్చుకోవాలని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఆయన యువతకు సందేశాన్ని ఇచ్చారు. ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు మాట్లాడుతూ యువత ఓటు హక్కును వినియోగించుకోవడం వలన సమాజానికి, మంచి నాయకత్వాన్ని, అందించే ఆస్కారం ఉంటూధని, ఓటు హక్కు ఎంతో విలువైందని దానిని నిర్లక్ష్యంచేస్తే,భవిష్యత్తు అందాకారమవుతుందని, డిఎస్పి యువతకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి, ఎల్లారెడ్డి తాసిల్దార్ అల్లం మహేందర్, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై మహేష్ మరియు ఎంఈఓ వెంకటేశం, రెవెన్యూ సిబ్బంది, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు నేషనల్ ఓటర్స్ డే ర్యాలీలో పాల్గొనికార్యక్రమాన్ని జయప్రదం చేశారు.





