నేటిసాక్షి, పెగడపల్లి (కె. గంగాధర్) : పెగడపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో ప్రతియేట నర్సింహాస్వామి బ్రహ్మోచ్చవాలు ఘనంగా నిర్వహిస్తారు అందులో భాగంగా మొదటి రోజున హోమం,రెండవ రోజున కుంకుమపూజ, మూడవ రోజున ఎడ్ల బండ్ల పోటీలు జరిపించి అన్నదానం చేస్తారు ఇక్కడికి చుట్టు పక్కల గ్రామాలనుండి తండోపతండాలుగా భక్తులు వచ్చి నరసింహాస్వామి ని దర్శించుకుంటారు వీటిలో భాగంగా మూడవ రోజున జరిపించే ఎడ్లబండ్ల పోటీలు ఆకర్షణగా నిలుస్తుతాయి ఈ రోజు గెలిచిన వారికి మొదటి బహుమతి గా గెలుపొందిన మేడారం గ్రామానికి చెందిన మధుకర్ కి పావుతులం బంగారం, రెండవ బహుమతిగా షైక్ భాషమియా కి పదితులాల వెండి, మూడవ బహుమతి ఐదు తులాల వెండి మాదాసు శంకరయ్య కి ఆలయ పెద్దలు అందజేశారు ఈ కార్యక్రమం లో ఆలయ చైర్మన్ కడారి మల్లయ్య, వైస్ చైర్మన్ రాయిల్లా రమేష్, గ్రామ పెద్దలు. కాశెట్టి వీరేశం, రాచురి బాపు, గడ్డం మోహన్, గడ్డం మనోజ్ ఇతరులు పాల్గొన్నారు.





