- చికిత్స చేసిన పశువైద్యులు
నేటి సాక్షి,వేమనపల్లి : మండలంలోని బొమ్మెన గ్రామంలో దాగామ లక్ష్మణ్ కు చెందిన వరి గడ్డికి ప్రమాదశత్తు నిప్పు అంటుకొగా పక్కన కట్టేసి ఉన్న 3 ఎద్దులు అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయలయ్యాయి. దీంతో బాధితుడు పశు వైద్యులకు సమాచారం అందించగా వెంటనే మండల పశువైద్యులు డా.సుప్రియ,డా.పవన్ కుమార్ అక్కడికి చేరుకొని పశువులకు చికిత్స చేశారు.వీరితో పశు వైద్య సిబ్బంది అస్లాం,గోపాల మిత్ర శ్రీకాంత్ ఉన్నారు.





