- గద్వాల శ్యాసనసభ్యులు స్వతంత్ర న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రములోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10:30 గంటలకు స్వతంత్ర న్యూస్ ఛానల్ నూతన సంవత్సరం 2025 తెలుగు క్యాలెండర్ ను గద్వాల నియోజకవర్గ శ్యాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భముగా ఆయన ఆట్లాడుతూ స్వతంత్ర న్యూస్ ఛానల్ యాజమాన్యముకు సిబ్బందికి ఆంగ్ల నూతన సంవస్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవస్సరం ఇలాగే దిన దినాభి వృద్ధి చెందాలని, ప్రజలకు వార్తల విషయంలో ముందుండాలని అన్నారు. ప్రజలకు ప్రతీ సమాచారం అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ, ఆదరాభిమానాలు పొందాలని స్వతంత్ర న్యూస్ ఛానల్ గద్వాల నియోజకవర్గ రిపోర్టర్ రవికుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అవినీతి పరుల గుండెల్లో పరుగులు పెట్టిస్తూ ఎప్పటి కప్పుడు ప్రజలకు వార్తలను అందిస్తున్న స్వతంత్ర న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమములో పాల్గొన్న సహా విలేకరులు 1 టివి న్యూస్ చానల్ రిపోర్టర్ వరప్రసాద్, రాజ్ న్యూస్ రిపోర్టర్ తీర్థాచరీ, విజన్ ఆంధ్ర న్యూస్ పేపర్ రిపోర్టర్ నర్సింహులు, ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం కృష్ణారెడ్డి మల్దకల్ మాజీ జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి గద్వాల పట్టణ మాజీ అధ్యక్షుడు గోవిందు, కౌన్సిలర్ బాబర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వీరేష్, తదితరులు పాల్గొన్నారు





