Monday, December 23, 2024

కెనరా బ్యాంకు ప్రభుత్వ పథకాల జాతర

  • బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి
  • మేనేజర్ శ్రావణ్ కుమార్

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలో శ్రీదేవి కళా సమితి వారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన కెనరా బ్యాంకు అందించే ప్రభుత్వ పథకాల జాతరను ఘనంగా వినూత్న రీతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ … కెనరా బ్యాంకు ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపు రుణాలు, అతితక్కువ వడ్డీ కే గోల్డ్ రుణాలు, హౌసింగ్ రుణాలు, వాహనాల రుణాలు, క్రాప్ రుణాలు, పీఎంజేజేబివై, పిఎంఎస్బివై ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మొదలగు ముఖ్యమైన పథకాల లబ్ది గురించి వివరించి, ఈ పథకాలను ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఖాతాదారులు సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజర్ శ్రావణ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్, బ్యాంకు అధికారులు నిఖిల్, డి.ఎస్.ఏ. (లోన్ ఏజెంట్) రాఘవుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News