Wednesday, March 25, 2026

క్యాన్సర్ పై ముందస్తు జాగ్రత్త అవసరం

  • అందు బాటులో అత్యాధునిక వైద్య చికిత్సలు
  • వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతాంబ

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ ప్రతిమ క్యాన్సర్ ఇనిస్ట్యూట్ క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ టెస్ట్ లను నిర్వహించారు. న్యాయ సేవ సదనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బిబి నిర్మల ప్రారంభించి మాట్లాడుతూ క్యాన్సర్ ను మహమ్మారిని ముందే గ్రహించ గలిగితే నివారణ సులభ తరం అవుతుందని తద్వారా ప్రాణాపాయ స్థితి నుండి బయట పడవచ్చు అని తెలిపారు. నిత్యం పని ఒత్తిడి లో ఉండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయ కూడదని సూచించారు. మంచి ఆహారపు అలవాట్లు నిత్యం మద్యపానం పొగాకు లకు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ మహమ్మారిని జయించవచ్చని అన్నారు క్యాన్సర్ కు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందు బాటులో ఉన్నాయని క్యాన్సర్ మహమ్మారి నుండి కోలుకున్న వారిని ఉదాహరణగా తీసుకొని ధైర్యంగా ఉండాలని తెలిపారు. క్యాన్సర్ పై అవగాహన ఉండి సరైన నియమాలు పాటిస్తే ఎదుర్కోవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అవినాష్ తిప్పని, వివిధ క్యాన్సర్ లక్షణాలు రాకుండా తీసుకో వలసిన జాగ్రత్తలు వివరించారు. కార్య క్రమంలో న్యాయ మూర్తులు న్యాయ వాదులు న్యాయశాఖ ఉద్యోగులు పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి మనిషా శ్రావణ్, ఉన్నం, వరంగల్ హనుమకొండ జిల్లాల న్యాయాధికార సంస్థ కార్యదర్శులు యం. సాయికుమార్, క్షమాదేశ్ పాండే, ఇతర వరంగల్ హనుమకొండ జిల్లాలో న్యాయ మూర్తులు వరంగల్ హనుమకొండ జిల్లా న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్ మాతాని రమేష్ బాబు, ప్రతిమ హాస్పిటల్ నుంచి డాక్టర్ సమిత్రా తిప్పాని చౌకత్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News