పెగడపల్లి:నేటిసాక్షి(కె గంగాధర్ ) : పెగడపల్లి మండల పరిధిలో 25,000/- వేల రూపాయల విలువగల కిలో గంజాయి పట్టివేత పెగడపల్లి మండల కేంద్రం లోని నార్సింహుని పేట గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో నలుగురు వ్యక్తులు గంజాయి తరలిస్తున్నట్టుగా పక్కా సమాచారం రావడంతో వారిని పట్టుకున్న ఎస్ఐ రవికిరణ్ ఇందులో పెగడపల్లి మండలానికి చెందిన ముగ్గురు వ్యకులు ఉండగా మరొకరు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి చెందినవాడు వారి వద్దనుండి కిలో గంజాయి, మూడు సెల్ ఫోన్స్ రెండు బండ్లు సీజ్ చేసి డిఎస్పి రఘుచంధర్, సీఐ నీలం రవి, ఎస్ఐ రవి కిరణ్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి ముగ్గిరి పైన కేస్ నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.

