- కుమారుడి మృతి
- తండ్రి కూతురు గల్లంతు
- గుండెపోటు రావడం తో ప్రమాదం


నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : మహబూబాద్ జిల్లా నెల్లి కుదురు మండలం మేచరాజు పల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది వరంగల్ నుంచి స్వ గ్రామానికి కుటుంబ సమేతంగా కారు లో వెళుతున్న సోమారపు ప్రవీణ్ (30) కు అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్ లోకి దూసుకుపోయింది సంగెం మండలం తీగరాజు పల్లి వద్ద ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కెనాల్ లో వీరు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది దీంతో ప్రవీణ్ ఆయన భార్య ఇద్దరు పిల్లలు నీటిలో మునిగి పోయారు గమనించిన స్థానికులు తాడు సహాయంతో భార్య కృష్ణవేణినీ కాపాడారు ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కుమారుడు సాయి వర్ధన్ (2) అక్కడికక్కడే మృతి చెందారు ప్రవీణ్ ఆయన కూతురు చైత్ర సాయి (4) కారు సహా నీటిలో గల్లంతయింది డ్రైవింగ్ సమయంలో ప్రవీణ్ కు చెస్ట్ పెయిన్ రావడంతో కారు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడిపోయినట్లు తెలుస్తోంది పోలీసులు గల్లంతైన తండ్రి కూతురు కోసం గాలిస్తున్నారు సోమారపు ప్రవీణ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అని తెలిసింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది వివిధ రాజకీయ పార్టీల నేతలు పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.



