- ప్రభుత్వ అధికారుల తీరు మరేనా
నేటిసాక్షి/మంగపేట : మండలంలో రేషన్ బియ్యం యాదేచ్చగా అక్రమ వ్యాపారం జరుగుతుంటే ప్రభుత్వ అధికారులు టాస్క్ పోర్స్ సివిల్ సప్లయ్ రెవిన్యూ పోలీస్ అధికారులకు పట్టించుకున్న పాపాన పోలేదు పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం పక్కా రాష్టాలకు జిల్లాలకు వెళుతుంటే ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుంటే అదేమీ అక్రమం నేరం కాదు అన్నట్లు ప్రభుత్వ అధికారులు చూస్తున్నారు. కొన్ని చోట్ల రేషన్ డీలర్లే కార్డు వోల్డర్ దగ్గర కొని షాపులకు మిల్లులకు కోళ్ల పెంపకం యజమానులకు గుత్తి కోయ వారికీ యాదేచ్చగా వ్యాపారం చేస్తుంటే ఒక్క అధికారి అయిన మండలంలో తనిఖీ చేసి డీలర్ పై, షాప్ పై కేసు సీజ్ గాని చేసిన దాకాలే లేవు. తుతూ మాత్రం తనిఖీలు చేసి వదిలేసినా ఘటనలు చాలా ఉన్నాయి. మండల డీలర్ల సంఘం నుండి ముడుపులు అధికార్లకు అందుతున్నాయనే భావన ప్రజల్లో ఉంది దీని అర్ధం రాష్ట్ర జిల్లా అధికారులు ఆదేశిస్తే చర్యలు ఉంటాయా అని ప్రజలు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మీద తనిఖీలు చేసి అక్రమ ఇసుక పై ఉక్కుపాదం మోపిన తీరు ప్రభుత్వ పీడీఎస్ బియ్యం రేషన్ డీలర్ల పై నిఘా పెట్టి అక్రమ రేషన్ బియ్యం దందాలకు చెక్ పెట్టాలని ప్రజలు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.





