- కార్గో సేవలపై అవగాహన ర్యాలీ
నేటిసాక్షి, రాయికల్: రాయికల్ పట్టణంలోని అంగడి బజార్లో కార్గో లాజిస్టిక్స్ కౌంటర్ ని టిఎస్ ఆర్టీసి కరీంనగర్ రీజియన్ ఏటీఎం రామారావు మంగళవారం ప్రారంభించారు. ఆనంతరం రాయికల్ పట్టణంలో ఆయన మార్కెటింగ్ టీం తో కార్గో సేవలు, హోమ్ డెలివరీల పైన ప్రతి షాప్ షాప్ కి పాంప్లెట్ పంచుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటీఎం రామారావు మాట్లాడుతూ రాయికల్ మండల పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు కార్గో లాజిస్టిక్స్ సేవలు అందుబాటులో ఉండాలని రాయికల్లో ప్రారంభించడం జరిగింని తెలిపారు. ప్రజలు ఈ కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకై రాయికల్ ఏజెంట్ శ్రీకాంత్ 9949970018 కి సంప్రదించగలరని తెలిపారు.





