నేటి సాక్షి, మెట్ పల్లి : జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు,కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పై మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.నియోజకవర్గంలో 2018 సంవత్సరం సెప్టెంబర్ 27న విద్యాసాగర్ రావు ప్రోసిడింగ్ పేపర్లు చెక్కులు పంపిణీ చేసి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారనీ కోర్టులో పట్టణానికి చెందిన పుల్ల రాజ గౌడ్ ఫిర్యాదు చేశారు. దీంతో 2024 సెప్టెంబర్ 27న కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ 25న మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.





