నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లి బిక్కవాగు నుంచి ఇల్లంతకుంట కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ నంబర్ AP15AT8210. డ్రైవర్ మచా మధు ను గన్నేరువరం పోలీసులు అదుపులోకి తీసుకొని ట్రాక్టర్ ను సీజ్ చేసి, ట్రాక్టర్ యజమాని కొండినొప్పుల మహేందర్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ. తాండ్ర నరేష్ తెలిపారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణా కు పాల్పడినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై నరేష్ తెలిపారు.





