Sunday, March 29, 2026

మిస్టరీ హత్య కేసును చేధించిన పోలీస్‌ అధికారులకు నగదు పురస్కారం

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : గత రెండు సంవత్సరాలు మిస్టరీ గా మిగిలి పోయిన కేసును చేధించి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచన పరకాల ఏసిపి సతీష్‌బాబుతో పాటు శాయంపేట సర్కిల్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రంజిత్‌ లను వరంగల్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అభినందిస్తూ నగదు పురస్కారాలను అందజేశారు. వివరాల్లోకి వెళితే రెండు సంవత్సరాల క్రితం పరకాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ధర్మారం గ్రామ శివారులో జరిగిన ఓ వృద్దురాలి హత్యకేసు లో నిందితులు పట్టు కొవడంలో ఎలాంటి క్లూస్‌ పరకాల పోలీసులకు లభించక పోవడంతో పాటు పరకాల పోలీస్‌ స్టేషన్‌ పలువురు ఇన్స్‌స్పెక్టర్లు పలుమార్లు బదిలీ కావడంతో ఈ కేసు ఓ మిస్టరీ గా నిలిచి పోవడం జరిగింది. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును శాయంపేట సర్కిల్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రంజిత్‌ అప్పంగించడం జరిగింది. దీనితో పరకాల ఏసిపి పర్యవేక్షణలో ఈ హత్య కేసు దర్యాప్తు చేపట్టిన రంజిత్‌ కొద్ది రోజుల్లోనే హత్యకు గురైంది శాయంపేట మండలం ఆరెపల్లి గ్రామస్తురాలిగా గుర్తించడంతో పాటు బంగారు ఆభరణాల కోసం అదే గ్రామానికి చెందిన ఇంటి రాజిరెడ్డి హత్య గురైన వృద్దురాలిని తీసుకవెళ్ళి ధర్మారం గ్రామ శివారులో దారుణంగా హత్య చేసినట్లుగా సర్కిల్‌ ఇన్స్‌స్పెక్టర్‌ దర్యాప్తులో బయట పడటం తో వృద్దురాలని హత్య చేసిన రాజిరెడ్డిని గత నెలలో పరకాల పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్‌ తరలించారు. ఎంతో కాలంగా పెండింగ్ లో వుంది పోలీసులకు ఓ సవాలుగా నిలిచిన ఈ హత్య కేసును ఛేదించడంలో ప్రతిభ కబరిచిన పోలీస్‌ అధికారులకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ నగదు పురస్కారాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో డిసిపి రవీందర్‌ పాల్గోన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News