Monday, March 16, 2026

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు విద్యార్థులకు సకాలంలో అందించాలి

  • నిబంధనల పేరట కాలయాపన చేయొద్దు
  • ఉప్లేటి బాబు స్వేరో జిల్లా అధ్యక్షులు

నేటి సాక్షి, బెజ్జంకి : బెజ్జంకి మండల కేంద్రంలో స్వేరోస్ నెట్వర్క్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఉప్పులేటి బాబు స్వేరో ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మండల తహసిల్దార్ సిబ్బందికి మెమొరాండం ఇచ్చారు. వారు మాట్లాడుతూ గురుకుల పాఠశాల అర్హత పరీక్షకై కావాల్సిన ఆదాయ,కుల ధ్రువీకరణ తదితర పత్రాల కోసం మండలంలోని తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పుతూ సమయానికి అందివ్వకుండా కాలయాపన చేస్తూ ధ్రువీకరణ పత్రాలకై అవసరం లేని నిబంధనల పేరిట విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ ప్రభుత్వం విద్యార్థులను గురుకుల పాఠశాలలో చేరకుండా చేస్తున్న ప్రయత్నమేనని విమర్శించారు. విద్యార్థులను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా వెంటనే ధ్రువీకరణ పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హత పరీక్ష అప్లై చివరి తేదీని పొడిగించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్ర సురేష్ కుమార్, స్వేరో మాజీ జిల్లా అధ్యక్షుడు బోనగిరి ప్రభాకర్, విద్యార్థి సంఘాల నాయకులు, సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్, సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, ఏఐవైఎఫ్ కార్యదర్శి దొంతరవేని మహేష్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వడ్లూరి పర్షరాములు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొత్త రాజ్ కుమార్ ఉప్పులేటి శ్రీనివాస్, బోనగిరి నవీన్, తాడిచెట్టు భూమయ్య, మహంకాళి బాలయ్య, మోదుంపల్లి రాజు, తల్లిందండ్రులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News