- మూడు విధాలుగా వివరాలు నమోదు చేసుకోవచ్చని వెల్లడించిన ప్రభుత్వం
- మండల ప్రజలను కోరిన ఎంపీడీవో గుండె బాబు
నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : గతంలో కుల గణన సర్వేలో వివరాలు ఇవ్వనివారు ఈనెల 28 వరకు తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగిందని కమలాపూర్ మండల అభివృద్ధి అధికారి గుండె బాబు తెలిపారు. వీరి కోసం మూడు విధాలుగా ప్రణాళికా శాఖ అవకాశాన్ని కల్పించింది. మొదటగా seeepvsurvey.cgg.gov.in వెబ్సైట్లో సర్వే దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని నింపి, యజమాని సంతకం చేసి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు ఐదు గంటల లోపు సమర్పించాలి. రెండోది మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్కులు, పట్టాదారు పాసుబుక్కులు మొదలైన మిగతా వివరాలతో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి మీ వివరాలు సమర్పించవలసి ఉంటుంది. మూడవది మీ మొబైల్ నుండి 04021111111 నెంబర్‌కు ఫోన్ చేసి మీ వివరాలు నమోదు చేసుకొనుటకు కోరినట్లయితే ఎన్యుమరేటర్లు నేరుగా మీ ఇంటికి వచ్చి వివరాలు సేకరించడం జరుగుతుందని ఎంపీడీవో గుండె బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు.





