Monday, March 16, 2026

కులం ఒక బలం! ఒక బలగం!!

  • ముదిరాజుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
  • 50కోట్లతో 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు
  • జిల్లా సంఘ భవనానికి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ
  • ముదిరాజ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ (కోక్కుల వంశీ) : ముదిరాజుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ముదిరాజ్ ల చిరకాల కోరిక బీసీ డి నుండి బీసీ ఏ లోకి మార్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ లో జిల్లా ముదిరాజ్ సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డితో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… జిల్లాలో ఉన్న ముదిరాజ్ కులస్తులకు నూతన కార్యవర్గం ఒక దిక్సూచిగా అండగా ఉండాలని, ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలును అందరికి అందేలా చూడాలని అన్నారు. రాబోవు రోజుల్లో ముదిరాజుల అభివృద్ధి కి పాటు పడాలని,కులం ఒక బలం బలగం లాగా పని చేస్తుందని, కలసి గట్టుగా ఉండి ఇతర కులాలను కలుపు కొని రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని అన్నారు. గ్రామాల్లో ప్రశ్నించే వారికి గొప్ప గుర్తింపు ఉంటుందని,సాటి బీసీ బిడ్డలుగా బీసీ, ఎస్టీ ఎస్సీ, లకు అండగా ఉండాలని అన్నారు. పని చేసిన వారికి ప్రజలు తప్పకుండా పట్టం కడతారని వారికి గుర్తింపు తప్పకుండా వస్తుందని నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా ఈ రోజు మీ ముందు ఉన్నానని అన్నారు. మిడ్ మానేరు డ్యాం లో చేపల పెంపకానికి కేజీ కల్చర్ ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని మత్స్యకారులు ఈ పథకాన్ని వియోగించుకోవాలని, ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాహుల్ గాంధీ దేశంలోని అసమానతలు రూపుమాపడానికి కుల గణన జరగాలని పేరొన్నారని,దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో కుల గణన నిర్వచించడం జరిగిందని త్వరలోనే బీసీ ల రిజర్వేషన్ పెంచడం జరుగుతుందని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇంచుమించు 50 కోట్లతో 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్టీ లము అందరూ కలసి గట్టుగా ఉండాలని అన్నారు. మహాత్మా జ్యోతి రావు పూలే పేరును ప్రజా ప్రభుత్వంలో ప్రగతి భవన్ కు ప్రజా భవన్ గా నామకరం చేశారని మహనీయుల అడుగు జాడల్లో నడుస్తూ ముందుకు పోదామని, ముదిరాజ్ జిల్లా సంఘ భవనానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జిల్లా మండలాల అధ్యక్షులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News