- పశువుల పండుగ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై గ్రామ దేవత కు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పాకాల మండలం గాదంకి పంచాయతీ గాదంకి గ్రామంలో పశువుల పండుగ వేడుకలను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. గాదంకి లో జరిగిన ఈ పండుగ సంబరాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని గారు హాజరయ్యారు. పశువుల యజమానులు గ్రామ దేవతకు పూజలు చేసి కోడెగిత్తలకు, అవులకు, దూడల కొమ్ములకు రంగులు వేసి కొప్పులు తొడిగారు. రాజకీయ నాయకుల, సినీనటుల ఫొటోలతో కూడిన చెక్క పలకలను కొమ్ములకు కట్టారు. మధ్యహ్నం 12 గంటలకు వీధిలో నిలుచున్న యువకుల మధ్య పశువులను గుంపులు, గుంపులుగా వదిలారు. అల్లి అవతల నిలబడిన యువకులు జోరుగా వచ్చే కోడెగిత్తలను నిలువరించేందుకు పోటీపడ్డారు. కొమ్ములకు కట్టిన చెక్కపలకలను సొంతం చేసుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పశువుల పండుగ ను చూడడానికి పరిసర ప్రాంతాల నుంచి యువకులు భారీగా తరలి రావడంతో ఆ గ్రామంలో సందడి నెలకొంది. గ్రామస్తులు భారీగా తరలి వచ్చిన వీక్షకులకు భోజనం, మజ్జిగ,తాగునీరు వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.





