నేటి సాక్షి,వేమనపల్లి : వేమనపల్లి మండల కేంద్రంలో గురువారం ఎస్ డీఎఫ్ నిధులతో సుంపుటం గ్రామంలో 30 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు,డ్రైనేజీ నిర్మాణ పనులు మాజీ జడ్పీటీసీ ఆర్. సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ తో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు మండల అభివృద్ది పనుల్లో భాగంగా ప్రారంభించినట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో అన్ని రకాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లపుడూ ముందుండి ప్రజల కోసం సంక్షేమ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒడిల రాజన్న, గాలి మధు పూర్ణచంద్రారెడ్డి మూర్ల రమేష్ ఆలం లక్ష్మణ్ ఎల్లల శేఖర్ కుబిడే కిష్టయ్య, దందేర మహేష్ ,ఆలం లక్ష్మణ్, కుబిడే నానేష్, దుర్గం తిరుపతి, దుర్గం మల్లేష్, లంగారీ దేవేందర్, కుబిడే మహేష్, కుబిడే శేఖర్, సంతోష్, రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

