- అభివృద్ధి పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చంద్రగిరి మండలం తొండవాడ ఎన్టీఆర్ కాలనీలో అభివృద్ది పనులకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని జిల్లా కలెక్టర్ కలెక్టర్ వెంకటేశ్వర్ తో కలిసి ఎమ్మెల్యే పులివర్తి నాని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తొండవాడ ఎన్టీఆర్ నగర్ కాలనీలో సుమారు 35 వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు గాను 12కోట్ల 82 లక్షల రూపాయలతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన అనంతరం రోడ్డు రోలర్ వాహనాన్ని నడిపి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు ఎన్టీఆర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రజా పాలన ఎలా ఉంటుందో చేసి చూపుతా. ఎమ్మెల్యే పులివర్తి నాని ఎన్టీఆర్ కాలనీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటామని స్థానికులకు ఆయన హామీ ఇచ్చారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.. గత వైసిపి ప్రభుత్వం మాదిరిగా ఏదో మాటలు చెప్పి, కాలయాపన చేసే ప్రభుత్వం కాదు మా కూటమి ప్రభుత్వం .మాది చేతల ప్రభుత్వము న్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తొండవాడ ఎన్టీఆర్ కాలనీలో 12 కోట్ల 82 లక్షల రూపాయలె కాదు ఇంకా అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు అలాగే తొండవాడ ఎన్టీఆర్ కాలనీకి ఎన్టీఆర్ పంచాయతీగా పేరు పెట్టాలి,అంగన్వాడీ భవనం మరియు ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను ఎమ్మెల్యే కోరారు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలోనే అంగన్వాడి భవనం నిర్మాణం చేపట్టాలి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.తొండవాడ ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో సోలార్ విద్యుత్ ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ ఎన్టీఆర్ కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, కుమార్ రాజా రెడ్డి, గౌస్ భాషా, ఆకుల ప్రభాకర్ నాయుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళి రెడ్డి,యల్లప్పరెడ్డి,హరి, తులసీశ్వర్ రెడ్డి, బాలకృష్ణ మూర్తి నాయుడు, వినోద్ కుమార్ రెడ్డి, మోహన్ రెడ్డి (బుజ్జి రెడ్డి) ప్రవీణ్ రాయలు, జనసేన నాయకులు తపసి మురళి రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





