నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రం ఆజామాబాద్ గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద 5 లక్షల రూపాయల సిసి రోడ్డు మంజూరు చేసినందుకు ఆజామాబాద్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాములో కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కుమ్మరి పండరి, గ్రామ ఉపాధ్యక్షులు గాండ్ల జీవన్, పట్లోళ్ల కిష్టయ్య, లచ్చ గౌడ్, లక్ష్మీనారాయణ, కుమ్మరి పెద్ద సాయన్న, కుమ్మరి గంగారం కుమ్మరి మల్లేష్, సాతేల్లి చంద్రయ్య, వేణు సెట్, కుమ్మరి శ్రీనివాస్, బిచ్చం సాయిలు, పట్లోళ్ల వెంకన్న గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామానికి 5 లక్షల రూపాయల సిసి రోడ్డు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే మదన్మోహన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.





