Sunday, March 15, 2026

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కు సీసీ రోడ్డు మంజూరు

  • కృతజ్ఞతలు తెలిపిన జాతర కమిటీ

నేటి సాక్షి,బెజ్జంకి: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి చొరవతో దేవక్కపల్లి గ్రామంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన సీసీ రోడ్డు నిర్మాణం కోసం మంజూరు చేయబడింది. ఈ సందర్భంగా, జాతర కమిటీ చైర్మన్ జంగిడి సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కరివేద మహిపాల్ రెడ్డి పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జంగిడి దేవరెడ్డి, రావుల రాజిరెడ్డి, రావుల రంగారెడ్డి, జనగామ సతీష్, సోరుపాక రాజు, జనగామ రాజు, జనగాం కనుకయ్య, జంగిడి కమలాకర్ రెడ్డి, బీరం చంద్ర రెడ్డి, మేరుగు కనుకయ్య తదితరులు హాజరయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News