నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్):
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం అని ధర్మపురి సీఐ రామ్ నర్సింహారెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతి గ్రామంలో, ప్రార్ధన మందిరాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న ఆదేశాలతో డిఎస్పీ డి.రఘు చందర్ సూచనల మేరకు శనివారం మండలంలోని కొత్తపేట గ్రామంలో మార్కండేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన నాలుగు సీసీ కెమెరాలను సీఐ ప్రారంభించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు భద్రతపరంగా గ్రామాన్ని సురక్షితంగా ఉంచడానికి, దేవాలయాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలని కోరారు. ఇట్టి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ఆలయ కమిటీ చైర్మన్ పురుషోత్తం, కమిటీ సభ్యులకు ఎస్సై అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ ఎస్సై ఆర్.ఉమ సాగర్, కానిస్టేబుల్ ఎం.డి అదిల్ తదితరులు పాల్గొన్నారు.




