Saturday, March 14, 2026

వెల్గోండ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి, ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : బుగ్గారం మండలంలోని వెల్గొండ గ్రామంలో శనివారం రోజున గ్రామ ప్రజలు మరియు యువకుల సహకారంతో ఏర్పరిచిన సిసి కెమెరాల ప్రారంభోత్సవం లో స్థానిక ఎస్సై శ్రీధర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ నేర నిరోధనలో మరియు పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర ప్రత్యేకమని మండలంలోని ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. జాతీయ యువకుల దినోత్సవం రోజు గ్రామంలో ఏర్పరిచిన కార్యక్రమంలో ఎస్ఐ పాల్గొని తన పిలుపు మేరకు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్యపాత్ర వహించిన గ్రామ పెద్దలను మరియు యువకులను ఎస్ఐ శ్రీధర్ రెడ్డి అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News