ప్రెస్ నోట్:
కరీంనగర్, జూలై 3:
*కరీంనగర్ రూరల్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను కనుగొని బాధితుడికి అందజేసి తమ సేవానిరతిని చాటుకున్నారు. సప్తగిరి కాలనీకి చెందిన అబ్దుల్ రెహమాన్ తన Moto Edge ఫోన్‌ను 2024, సెప్టెంబర్ 2వ తేదీన నగునూరులో పోగొట్టుకున్నారు. వెంటనే ఆయన రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన రూరల్ పోలీసులు, CEIR (Central Equipment Identity Register) టెక్నాలజీని ఉపయోగించి ఫోన్ ఆచూకీని గుర్తించేందుకు కృషి చేశారు. ఈ టెక్నాలజీ సహాయంతో పోగొట్టుకున్న ఫోన్ కశ్మీర్లో ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ ఉన్న ప్రదేశాన్ని పక్కాగా గుర్తించిన పోలీసులు, దానిని తిరిగి పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.
గురువారం నాడు, రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి గారు పోగొట్టుకున్న ఆ Moto Edge ఫోన్‌ను దాని యజమాని అబ్దుల్ రెహమాన్‌కు తిరిగి అప్పగించారు. తన ఫోన్ తిరిగి లభించినందుకు అబ్దుల్ రెహమాన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫోన్‌ను ట్రేస్ చేయడంలో విశేష కృషి చేసిన కానిస్టేబుల్ విశ్వతేజను సీఐ ఏ. నిరంజన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు.





