- సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమల్ గౌడ్
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమల్ గౌడ్ హుజురాబాద్ మండల మరియు పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, అందరికీ నూతన సంవత్సరం మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరము ముగింపు సందర్భంగా డిసెంబర్ 31 రోజున రోడ్లమీద నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవద్దని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని, ఎక్కడివారు అక్కడే వారివారి ఇండ్లలోనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని ఆదేశించారు. హుజురాబాద్ పోలీసు వారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మండల పరిధిలో నాలుగు బృందాలుగా ఏర్పడి స్పెషల్ డ్రైవ్, వెహికల్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి కార్యక్రమాలు చేపట్టబడునునని చెప్పారు. ప్రజలందరూ ఎవరు కూడా నూతన సంవత్సర వేడుకలను వారి వారి కి సంబంధించిన ప్రదేశాలలో మాత్రమే జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఎవరైనా నిబంధనలకు అతిక్రమించి ప్రవర్తిస్తే వారిపైన చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

